ముంపు ప్రాంతాన్ని పర్యవేక్షించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకురు, పల్లిపాలెం లోతట్టు ప్రదేశాలను సందర్శించేందుకు ఎమ్మెల్యే బోటులో వెళ్లారు. ప్రవాహం అధికంగా ఉండటంతో కొంతసేపు హడావుడి నెలకొంది. దీంతో వైసీపీ నేతలు, అధికారులు ఆందోళన చెందారు. స్థానిక మత్స్యకారులు కష్టం మీద ఎమ్మెల్యేను ఒడ్డుకు చేర్చారు.
ఇదీ చదవండీ...నివర్ ఎఫెక్ట్.. సీమ జిల్లాలు అతలాకుతలం