నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నివర్ తుపాను ధాటికి నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. పూడిపర్తి, ఈదగాలి, జంగాలపల్లి గ్రామాల్లో అధికారులతో కలిసి బాధిత రైతులతో మాట్లాడారు.
తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం 80 శాతం రాయితీతో వరి విత్తనాలు రైతులకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలిపారు.
ఇవీ చదవండి..