ETV Bharat / state

"ప్రజలకు మెరుగైన సేవలే..సచివాలయాల ధ్యేయం"

నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

"ప్రజలకు మెరుగైన సేవలను ... అందించటమే సచివాలయాల ధ్యేయం"
author img

By

Published : Oct 2, 2019, 10:44 PM IST

"ప్రజలకు మెరుగైన సేవలను ... అందించటమే సచివాలయాల ధ్యేయం"

అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే లక్షా 30 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరం 48వ డివిజన్, బాలాయపల్లి మండలం, ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థను మంత్రి అనిల్, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రేషన్ కార్డులు, పింఛన్లు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతి ఏటా జనవరిలో కొత్త ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు నెల్లూరు నగరంలో 166 సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు.

ఇవీ చదవండి

మూడేళ్లు సమయం ఇవ్వండి.. మార్పు మీరే చూడండి!

Intro:కడప జిల్లా కమలాపురం సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

కమలాపురం నియోజకవర్గం లో మొదటగా చింతకొమ్మదిన్నె సచివాలయం నుంచి మొత్తం ఆరు మండలాల సచివాలయలను ప్రారంభించాడు కమలాపురంలో మొదటగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి సచివాలయాన్ని ప్రారంభించారు గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయం ప్రారంభించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చిన జగన్మోహన్రెడ్డి మాట తప్పకుండా పనులను పూర్తి చేస్తున్నాడు అని అన్నాడు సచివాలయ ఉద్యోగుల ను పరిచయం చేసుకొని మీరు అంతా పారదర్శకంగా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా కుల మత వర్గాలకు అతీతంగా పని చేయాలన్నారు

బైట్ పి రవీంద్రనాధ్ రెడ్డి
(కమలాపురం యం యల్ ఏ)

Body:sachivalayam

Conclusion:kadapa kamalapuram

For All Latest Updates

TAGGED:

SACHIVALAYAM
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.