నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో ప్రస్తుతం 43 టీఎంసీల నిల్వ ఉంది. వారం రోజుల కిందట అధికారులు ఉత్తర, దక్షిణ కాలువల ద్వారా తాగు, సాగు నీరు విడుదల చేశారు. రెండో పంట వెసుకునేందుకు రైతులు సిద్దం కాగా.. జలాశయం నుంచి కాలవల ద్వారా చెరువులకు నీరు చెరుతుందా లేదా, పలు అంశాలపై మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉత్తరకాలవ ద్వారా ప్రవహిస్తున్న ఆత్మకూరు చెరువు ఎయస్ పేట మండలం రాజవోలు చెరువును పరిశీలించారు. జలాశయంలో నీరు పుష్కలంగా ఉందని... చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని అధికారులకు సూచించారు.
ఇవీ చదవండి: అమ్మను చివరిచూపు చూడకుండానే ఇర్ఫాన్ కూడా!