నెల్లూరులో ఈ నెల 11న.. అమ్మ ఒడి రెండో విడత నిధుల విడుదల కార్యక్రమానికి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. అధికారులను ఆదేశించారు. జడ్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు.
విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నాణ్యమైన భోజనం అందించాలని, పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ చక్రధర్‌బాబు, జేసీ హరేందిరప్రసాద్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంతో పాటు వివిధశాఖల అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. సీఎం పర్యటనపై నెల్లూరు గ్రామీణం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఇదీ చదవండి:
శిథిలావస్థకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు.. పట్టించుకునే వారే లేరా?