నెల్లూరు నగరంలో రూ.2.80 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన చేపల మార్కెట్‌ను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో చేపల మార్కెట్ తీర్చిదిద్దినట్లు మంత్రి తెలిపారు. మటన్ మార్కెట్ పనులను త్వరలోనే చేపడతామని వెల్లడించారు. చేపల మార్కెట్, మటన్ మార్కెట్లలోని వ్యర్థ జలాలను వినియోగంలోకి తీసుకోవచ్చేలా 70 లక్షల రూపాయలతో ఎస్.టి.పి. ప్లాంటును నిర్మిస్తామని ప్రకటించారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్‌ను ఆధునికీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫ్కాఫ్ చైర్మన్ అనీల్ బాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే