కర్నూలులో మినీ లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున... మున్సిపల్ కమిషనర్, మేయర్, పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు సోమవారం నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరవాలని సూచించారు. ఫలితంగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మధ్యాహ్నం నుంచి షాపులను బంద్ చేశారు.
అనంతపురం జిల్లాలో...
అనంతపురం జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో... ఇవాల్టి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని అధికారులు సూచించారు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
వెంకటగిరిలో...
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో కరోనా వ్యాప్తి నియంత్రణకు నేటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు పట్టణంలో విధించిన ఆంక్షలను అమలు చేయాలని కోరుతూ మైక్ ద్వారా సూచనలు చేశారు.
ఇదీ చదవండి: