Atmakuru by-election: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. విక్రమ్ రెడ్డిని నిలబెట్టేందుకు కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్‌రెడ్డి తండ్రి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా మేకపాటి కుటుంబం ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
గౌతంరెడ్డి మరణాంతరం... సతీమణి శ్రీకీర్తి ఆత్మకూరు నుంచి బరిలో దిగుతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. వీటన్నింటికి మేకపాటి కుటుంబ సభ్యులు ముగింపు పలికారు. గౌతంరెడ్డి స్థానం భర్తీ చేసేందుకు విక్రమ్ రెడ్డి సరైన ప్రత్యామ్నాయమని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో వైకాపాను బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు సేవ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజమోహన్‌రెడ్డి తెలిపారు. విక్రమ్ రెడ్డి ఊటిలోని గుడ్ షెపర్డ్ పబ్లిక్ స్కూల్, ఐఐటీ చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలో కన్సస్ట్రక్షన్ మేనేజ్ మెంట్లో ఎంఎస్ పూర్తి చేసిన ఆయన... దివంగత మాజీ మంత్రి గౌతం రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కేఏంసీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చదవండి: తుడా చైర్మన్ పదవీకాలం పొడిగింపు.. మరో రెండేళ్లు కొనసాగనున్న చెవిరెడ్డి