ETV Bharat / state

ఎవరు ఓడినా.. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే: అనిల్ కుమార్ సవాల్​పై మేకపాటి

Mekapati Chandrasekhar Reddy challenge : 'వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా... గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా... నువ్వు గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు.' అని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి.. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు సవాల్ విసిరారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 28, 2023, 5:28 PM IST

Updated : Mar 28, 2023, 6:07 PM IST

Mekapati Chandrasekhar Reddy challenge : నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల వాతావరణం రసవత్తరంగా మారింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే నెపంతో అధికార పార్టీ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యాన.. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురూ గెలిస్తే.. తాను రాజకీయాలు మానుకుంటానని చెప్పారు. ఒకవేళ.. తాను గెలిచి అసెంబ్లీకి వస్తే మీరంతా రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని సవాల్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అంతే స్థాయిలో దీటుగా బదులిచ్చారు. 'వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా... గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా... నువ్వు గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు.' అని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి.. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను ఉద్దేశించి సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బెంగూళురు నుంచి స్వగ్రామమైన మర్రిపాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా. గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా. నువ్వు గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. సింగిల్ డిజిట్ తో గెలిచిన నువ్వు ఎక్కడ.. 35 వేలమెజార్టీతో గెలిచిన నేనెక్కడ..? వచ్చే ఎన్నికల్లో నేను, ఆనం, కోటంరెడ్డి గెలవడం ఖాయం. అని పేర్కొన్నారు.

అనిల్ కుమార్.. నువ్వు సింగిల్ డిజిట్ తో గెలిచావు. నేను 35వేల ఓట్ల మెజార్టీతో గెలిచా. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే అయితే.. నువ్వు రెండు సార్లే గెలిచావు. మా ప్రజలు మమ్మల్ని నమ్ముతారు.. మీ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మీకు నోరుందని అరిస్తే బాగుండదు. నీ వయస్సులో ఉన్నపుడు నేను నీ కంటే ఎక్కువే చేశా. నీ నియోజకవర్గ జనం నువ్వు ఓడిపోతావని చెప్పుకుంటున్నారు. అందుకే అతిగా మాట్లాడకుంటే మంచిది. నువ్వు అన్నట్లుగా కాకుండా... నేను, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి తప్పకుండా గెలుస్తాం. రామనారాణరెడ్డి నూటికి నూరు శాతం గెలుస్తాడు. కోటంరెడ్డి నూటికి నూటొక్క శాతం గెలుస్తాడు. ఈ సారి ఎన్నికల్లో నీ ఓటమి ఖాయం. ప్రభుత్వం మార్పు ఖాయం. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. అయినా ఈ సారి ఎన్నికల్లో మీకు టికెట్ కూడా ఇవ్వరని ప్రచారం జరుగుతుంది. ముందు ఆ సంగతి చూసుకో.. - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే

ఎమ్మెల్యే మేకపాటి

ఇవీ చదవండి :

Last Updated : Mar 28, 2023, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.