ETV Bharat / state

కాసుల కోసం వైద్య సిబ్బంది కక్కుర్తి.. డబ్బులు లేవన్నా కనికరం లేకుండా..! - sending patients to private labs for tests

: నెల్లూరు జిల్లా వైద్యశాలలో కాసులకు కక్కుర్తిపడి వైద్యులు అడ్డదారులు తొక్కుతున్నారు. గర్భిణీలకు అవసరం లేకపోయినా ప్రైవేటు క్లినిక్ సెంటర్​కు స్కానింగ్​లకు పంపిస్తున్నారు. ప్రైవేట్ క్లినిక్ సెంటర్​తో ఆసుపత్రి సిబ్బంది కుమ్మక్కయ్యారు. దీంతో ప్రైవేట్ ల్యాబ్​ల్లో స్కానింగ్ చేయించుకునే స్తోమత లేక ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్​ చెప్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 9, 2023, 3:17 PM IST

Government Hospital Medical Staff are Sidetracked for Money: వైద్యులని, వైద్య సిబ్బందిని దేవుడితో సమానంగా చూస్తాం. కానీ అటువంటి వారే అడ్డదారులు తొక్కుతూ కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. నిత్యం ఎంతోమంది రోగులు, గర్భిణీలు ఆ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించుకోలేని అనేకమంది గిరిజనులు, పేద ప్రజలు.. ఆ హాస్పిటల్​కే వస్తూ ఉంటారు.

కానీ వారి పేదరికాన్ని, ఎంతో కష్టాలతో వచ్చే గిరిజనులను చూసి ఆ ఆసుపత్రి వైద్య సిబ్బంది మనసు ఏం మాత్రం చలించలేదు. గిరిజనుల దగ్గర నుంచి కూడా డబ్బులను దోచుకోవాలని అనుకున్నారు. ఇంకేం ఉంది.. ఆసుపత్రి బయట ఉన్న ఓ స్కానింగ్ సెంటర్ వ్యక్తితో కుమ్మక్కయ్యారు. అడిగేవారే లేరన్నట్టుగా.. యథేచ్ఛగా తమ దందా మొదలుపెట్టారు. అవసరం లేకపోయినా సరే.. కరోనా టెస్టు, స్కానింగ్ అంటూ.. బయట స్కానింగ్ సెంటర్​కు వెళ్లి టెస్టులు చేయించుకుని రమ్మనేవారు. డబ్బులు లేక.. ఎంతో దూరం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పేద ప్రజలను దోచుకుంటున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిల్లా వైద్యశాలలో ఈ తతంగమంతా జరుగుతోంది. గర్భిణీలకు అవసరం లేకపోయినా.. జిల్లా వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్​గా పనిచేస్తున్న పెంచలయ్య అనే వ్యక్తి.. ప్రైవేటు క్లినిక్ సెంటర్​కు స్కానింగ్​లకు పంపిస్తున్నారు. ప్రైవేట్ క్లినిక్ సెంటర్ పెంచలయ్యతో కుమ్మక్కై కాసులకు కక్కుర్తి పడి డాక్టర్లు ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ల్యాబ్​కు రాసి పంపిస్తున్నారు.

ఆత్మకూరు మండలం గండ్లవీడుకు చెందిన గిరిజన మహిళ శాంతికి ప్రైవేటు ల్యాబ్ స్కానింగ్ కోసం వైద్యులు రాసి పంపించారు. ప్రైవేట్ ల్యాబ్​లో స్కానింగ్ చేయించుకునే స్తోమత లేక శాంతి తిరిగి ఆసుపత్రికి వచ్చింది. అయితే దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్​ శేషరత్నంను వివరణ కోరగా ప్రైవేటు స్లిప్పులపై ప్రభుత్వ డాక్టర్లు రాయకూడదని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్​లకు పంపిస్తున్న.. ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది

"కరోనా పరీక్ష, స్కానింగ్ బయట చేయించుకోమన్నారు. ఆసుపత్రిలో స్కానింగ్ లేదు అన్నారు. బయటకు వెళ్లి పరీక్షలు చేసుకొని రావాలని చెప్పారు". - శాంతి, బాధిత మహిళ

"ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే.. స్కానింగ్ గురించి. అవసరం లేకున్నా బయటకు రాస్తున్నారని తెలిసింది. అది ఇప్పుడే నా దృష్టికి తెచ్చారు కాబట్టి.. నేను దానిని పరిశీలిస్తాను. పరిశీలించి రెక్టిఫై చేస్తాను. ప్రజలకు మన దగ్గరే వైద్యం, స్కానింగ్ అన్నీ అందేట్లు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వేరే ఫిర్యాదు వచ్చింది. ప్రైవేటు ల్యాబ్ స్లిప్​లలో రాస్తున్నారని అన్నారు. అలాంటివి ఏవీ ఉండకూడదు. దీనిపై కూడా దృష్టి పెట్టి.. రెక్టిఫై చేస్తాం". - శేషరత్నం, ఆసుపత్రి సూపరింటెండెంట్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.