ETV Bharat / state

ఏఎస్ ​పేట దర్గాలో సామూహిక ప్రార్థనలు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

కరోనా వ్యాప్తి కారణంగా రంజాన్ ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోండని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నా కొందరు మారటం లేదు. ఎవరెన్ని చెప్పినా మా దారి మాదే అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లాక్​డౌన్​ను ఉల్లంఘిస్తూ ఏఎస్​ పేటలోని దర్గాలో సామూహికంగా ప్రార్థనలు చేస్తున్నారు.

AS peta darga
AS peta darga
author img

By

Published : Apr 25, 2020, 4:32 AM IST

ఏఎస్ ​పేట దర్గాలో సామూహిక ప్రార్థనలు

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రంజాన్​ మాసాన్ని ఇంట్లోనే జరుపుకోవాలని సీఎం జగన్​ సహా అధికారులు సూచిస్తున్నారు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్​ పేట మండల కేంద్రంలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో రాత్రి వేళల్లో గుంపులు గుంపులుగా భక్తులు సంచరిస్తూ మత ప్రార్థనలు చేస్తున్నారు. దర్గా ముతవల్లి ఆఫీస్ పాషా నిత్యం రాత్రివేళల్లో 40 మంది పైగా భక్తులతో ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా మత ప్రార్థనలు చేయిస్తున్నారు. వీరి తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే రంజాన్ మాసంలో ప్రార్థనలు కొనసాగించే అవకాశం ఉందని గ్రామస్థులు భయపడుతున్నారు. మత ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ పరీక్షలు నిర్వహించి దర్గా కమిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.