నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, ఉదయగిరి, కలిగిరి, వింజమూరు తదితర మండలాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో పొగాకు సాగు చేస్తుంటారు. ఓ సంవత్సరం మంచి ధరలు పలికినా... మరో ఏట ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించి మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని డీసీ పల్లి, కలిగిరి కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించారు. మేలి రకం పొగాకును కిలో రూ. 201కు కొనుగోలు చేయడం వల్ల నెల్లూరు జిల్లా పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ధరకు పొగాకు కొనుగోలు కేంద్రంలో వ్యాపారులు కొనుగోలు చేయలేదని, ప్రభుత్వమే కొనుగోలు చేయడం సంతోషంగా ఉందని రైతులు తెలిపారు.
ఈ విషయంపై డీసీ పల్లి పొగాకు వేలం నిర్వహణాధికారి దేవానంద హర్షం వ్యక్తం చేశారు. రైతులు ఇంకా నాణ్యమైన పొగాకు తీసుకొస్తే ఇంకా మంచి రేట్లు వస్తాయన్నారు.
ఇదీ చదవండి :డీసీ పల్లి పొగాకు కేంద్రంలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభం