ETV Bharat / state

మేలెంచితేనే... ఫలం.. ఫలితం! - Ripe fruit news

ఆహార చట్టం ప్రకారం కార్బైడ్‌ వాడకం నిషేధం. అతిక్రమిస్తే మూడేళ్ల జైలుతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. దీని ద్వారా మాగబెట్టిన పండ్లను తిన్న వారికి ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయి. కేంద్రనాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కార్బైడ్‌ను ప్యాకెట్లు చుట్టే వారూ అనారోగ్యం పాలవుతున్నారు. నెల్లూరు కూరగాయల మార్కెట్‌, పొదలకూరులో రైపనింగ్‌ ఛాంబర్లు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేవారు లేక దాదాపు ఖాళీగా ఉన్నాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టం అనుమతించిన పద్ధతులను పెద్దఎత్తున ఆచరించేలా అధికారులు చూడాల్సి ఉంది.

mangoes
మామిడి కాయలు
author img

By

Published : May 9, 2021, 5:52 PM IST

రోజూ ఓ యాపిల్‌ తింటే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదంటారు. భోజనానికి అరగంట ముందుగానీ, తర్వాత గానీ నాలుగు బొప్పాయి ముక్కలు తింటే జీర్ణశక్తి సజావుగా సాగుతుందంటారు. అరటి పండుతో తక్షణ శక్తి, పైనాపిల్‌, దానిమ్మ పండ్లతో అందం వికసిస్తుందని చెబుతుంటారు. అందుకే.. ఎక్కువ మంది పండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రజలకు మరింత శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఫలాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో.. దుకాణాల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. నాణ్యతపై ఎవరూ శ్రద్ధ చూపడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పండ్లను మగ్గించేందుకు రసాయనాలను వినియోగించే వీలులేదని హైకోర్టు ఆదేశించినా.. వ్యాపారుల పంథాలో మార్పు లేకుండా పోయింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విచ్చలవిడిగా వినియోగమవుతోంది. కార్బైడ్‌ నిషేధం అపహాస్యమవుతోంది. ఏదీ కార్బైడ్‌తో మాగ బెట్టింది.? ఏది సహజంగా పండిందో తెలియని దుస్థితి. డబ్బుకు కక్కుర్తిపడి కొందరు వ్యాపారులు ప్రజారోగ్యాన్ని తాకట్టు పెడుతున్నారు.

ఏదీ నాటి రుచి

వేసవితో పాటే మామిడి మార్కెట్‌కు వచ్చేసింది. నగరంలో ఇప్పుడిప్పుడే విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు వాటిని రుచి చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్న ప్రజలు మాత్రం.. చివరకు నిరుత్సాహానికి గురవుతున్నారు. కారణం.. నిగనిగలాడే పండ్లను చూసి కొనుగోలు చేస్తున్నవారు.. రుచి చప్పగా ఉండటంతో నిరాశకు చెందుతున్నారు. జిల్లాలో కొందరు వ్యాపారులు తక్కువ సమయంలో మగ్గించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తుండగా- దాని ఫలితంగానే మామిడి సహజ రుచి కోల్పోతోందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క మామిడే కాదు.. ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న సపోటా, అరటి, బత్తాయి తదితరాలదీ అదే తీరంటున్నారు.’

సురక్షిత పద్ధతులు మేలు..

పండ్లను క్లైమేటెరిక్‌, నాన్‌-క్లైమేటెరిక్‌ రకాలుగా విభజించారు. మామిడి, ఆపిల్‌, అరటి, బ్లాక్‌బెర్రీ, కివి తదితరాలు క్లైమేటెరిక్‌ కిందకు వస్తే, నిమ్మ, బత్తాయి, కమలా, ద్రాక్ష తదితరాలు నాన్‌-క్లైమేటెరిక్‌ కిందకు వస్తాయి. ఇవి చెట్లపై ఉన్నప్పుడే పండుతాయి. క్లైమేటెరిక్‌ పండ్లు కోసిన తర్వాత మాగుతాయి. ఈ రకానికి చెందిన మామిడిలో సహజంగానే ఇథలీన్‌ ఎంజైమ్‌ ఉంటుంది. దీని కారణంగానే కాయలో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. దీని వల్ల పండు మాగుతుంది.

త్వరగా పక్వానికి వచ్చేందుకు ఇథలీన్‌ గ్యాస్‌ను వినియోగిస్తారు. ఇది కాయలోని సహజమైన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఈ పద్ధతిని ప్రపంచ వ్యాప్తంగా ఆమోదయోగ్యమైందిగా గుర్తించారు. వాణిజ్యపరంగా అధిక మోతాదులో కాయలు మాగబెట్టడానికి రైపనింగ్‌ ఛాంబర్స్‌ను వినియోగించవచ్ఛు

అవగాహన కల్పిస్తాం..

సురక్షిత పద్ధతుల్లో పండ్లు మాగబెట్టడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మంచి కాయలకు ధర ఎంతైనా ఇచ్చేందుకు ఎగుమతిదారులు సిద్ధపడుతున్నారు. రైపనింగ్‌ ఛాంబర్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి. కొద్ది పరిమాణాల్లో విక్రయించే వారు కూడా తక్కువ వ్యయంతో వీటిని ఏర్పాటు చేసుకోవచ్ఛు ప్రస్తుతం జిల్లాలో మామిడి, అరటి పండ్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని మాగబెట్టేందుకు ఇథలీన్‌ను ఎక్కువగా ఉపయోగించమని రైతులు, వ్యాపారులకు సూచిస్తున్నాం. జిల్లాలో మామిడి కాయలు దాదాపు వాతావరణం పరంగానే మాగుతుంటాయి. వాటికి ఇథలీన్‌ను ఉపయోగించవద్ధు. - ప్రదీప్‌కుమార్‌, ఏడీ ఉద్యానశాఖ

తనిఖీలు చేపడతాం

కృత్రిమంగా పండ్లను మాగబెట్టే విధానాలు ఎక్కడ పాటిస్తున్నారో పరిశీలించి దృష్టి సారిస్తాం. త్వరలో తనిఖీలు ప్రారంభించి.. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నట్టు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తాం. ఇటీవల గూడూరులో ఓ చోట తనిఖీ చేశాం. ప్రస్తుతం సిబ్బంది కరోనాతో ఇబ్బంది పడుతుండటం వల్ల ఆపేశాం. - ఎస్‌.శ్రీనివాస్‌, జిల్లా ఆహార తనిఖీ అధికారి

ఇదీ చదవండి:

ఇంటివద్దకే రేషన్‌: వాహనాలను తిరిగిచ్చేసిన 10మంది ఆపరేటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.