నెల్లూరులో నెలకొల్పిన సంగీత కళాశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని మండలి బుద్ధ ప్రసాద్ కోరారు. నెల్లూరులో కలెక్టరేట్ కూడలిలో తిక్కన విగ్రహం ఏర్పాటు చేయాలన్న బాలు కోరికను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు అధికారులు, పుర ప్రముఖులు ఇందుకు పూనుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. తయారైన విగ్రహం నెల్లూరు సంగీత కళాశాలలో భద్రపరిచామని చెప్పారు. బాలు పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఒక రాష్ట్ర స్థాయి సంస్థకు బాలు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మండలి బుద్ధప్రసాద్ కోరారు.
ఇదీ చదవండి : అశ్రునయనాలతో బాలుకు అంతిమ వీడ్కోలు