నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జి చెరువుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడి రఘురామయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. విద్యుత్ తీగ తెగి పడటంతో ఇంటిముందున్న గేదెలు అరుస్తున్నాయి. ఆవులు పొడుస్తున్నాయని భావించిన రఘురామయ్య గేదెల వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగను పట్టుకున్నాడు. అనంతరం ఆయన తల్లి చిన్న సుబ్బమ్మ కొడుకును కాపాడే ప్రయత్నంలో విద్యుత్ తీగ పట్టుకుని కేకలు వేసింది. గమనించిన స్థానికులు చిన్న సుబ్బమ్మను కాపాడారు. రఘురామయ్యను కరెంటు తీగ వదలకపోవడం వల్ల మృతి చెందాడు. బంధువులు మృతదేహం వద్ద విలపించిన ఘటన అందరినీ కలిచివేసింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలను సరిచేయాలని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ వారు పట్టించుకోని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: వ్యవసాయ బావిలో యువకుడి అనుమానాస్పద మృతి