నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీ ప్రసూనాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దేవతా మూర్తుల విగ్రహాలకు రథోత్సవం నిర్వహించారు. స్వామి వారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామి అమ్మవార్లకు చక్రస్నానం నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి...