నెల్లూరు జిల్లా ఆత్మకూరు మద్యం దుకణాల వద్ద దసరా సందర్బంగా మద్యం బాబులు బారులు తీరారు. ఓ వైపు కరోనా ప్రబలుతున్నా.. మరోవైపు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా గుమిగూడటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మాస్కులు లేకుండా..
మాస్కులు సైతం లేకుండా ఒకరిపై ఒకరు ఎగబడ్డారు. కిలోమీటర్ మేర మందుబాబులు బారులు తీరినా పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.