ETV Bharat / state

మిగిలింది ఆవేదనే! తేలని ఇళ్లు, స్థలాల లెక్కలు

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో జాతీయ రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూములకు సరైన పరిహారం అందించడం లేదని బాధితులు చెప్తున్నారు. నేటి ధరలకు, అధికారులు వేసిన లెక్కలకు పొంతన లేదని వాపోతున్నారు.

less compensation to farmers
తేలని ఇళ్లు, స్థలాల లెక్కలు
author img

By

Published : Oct 3, 2020, 3:24 PM IST

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో జాతీయ రహదారి విస్తరణ కోసం 56.10 హెక్టార్లు తీసుకుంటున్నారు. ఇందులో పట్టా భూములు 28.28 హెక్టార్లు, ప్రభుత్వ భూములు 16.38 హెక్టార్లు, దరఖాస్తు భూములు 9.69 హెక్టార్లు, సీజేఎఫ్‌ఎస్‌ భూములు 5.82 హెక్టార్ల మేరకు తీసుకున్నారు. వీటితో పాటు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. రైతులతో సమావేశాలు నిర్వహించని అధికారులు అవార్డు పేరిట ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులు, వినతులు తీసుకున్నారు. ఇలా అన్నీ తీసుకున్నా పరిహారం నిర్ణయంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇక్కడ ధరలకు.. వారి అంచనాలకు చాలా తేడా ఉంది. ఎకరం, అరెకరం ఉన్న రైతులు పొట్ట కొట్టినట్లయ్యింది. దీనిపై ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవటంతో అధికారులు లెక్కల మేరకు 3 రెట్లు అంటూ అంచనాలేశారు.

లెక్కలు ఇలా..

రహదారి ఆనుకుని ఉండే చావలిలో రూ. 7 లక్షలు, కొత్తూరు రూ. 6 లక్షలు, పెళ్లకూరు రూ. 6.5 లక్షలు, పునబాక రూ. 4 లక్షలు, తాళ్వాయపాడు రూ. 7 లక్షలు, చిల్లకూరు రూ. 6 లక్షలు, జీలపాటూరు రూ. 6.5 లక్షలు, చింతపూడి రూ. 3 లక్షలు, నెలబల్లిలో రూ. 6 లక్షలుగా ప్రాథమికంగా అంచనాలు నిర్ణయించారు. ఈ మేరకు మూడు రెట్లు లెక్కలేసి రైతు ఖాతాల్లో వేస్తున్నారు. ఇప్పటికే నెలబల్లిలో కొందరు రైతులకు పరిహారం వారి ఖాతాల్లో పడింది. మిగిలిన రైతులకు త్వరలో వేయనున్నట్లు సమాచారం.

నేటి ధరకు.. పరిహారానికి పొంతనేదీ

భూముల ధరలకు, పరిహారానికి పొంతన లేదని రైతుల చెప్తున్నారు. భూసేకరణ చట్టం 2013 మేరకు నిర్ణయాలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. రైతులు ఇక్కడ భూమి కోల్పోతే మరో చోట భూమి కొనే పరిస్థితి లేదు. ఇక తాము ఎలా బతకాలని వాపోతున్నారు. ఇక ఇళ్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. స్థలం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో పరిహారం తక్కువగా లెక్కలేశారని బాధితులు వాపోతున్నారు.

చిన్నరైతులకు గడ్డు పరిస్థితి - చిరంజీవి, తాళ్వాయపాడు

కుటుంబ భాగస్వామ్యం నుంచి వచ్చిన ఎకరం భూమిలో 0.60 సెంట్లు జాతీయ రహదారి విస్తరణలో పోతుంది. ఇక్కడ పరిహారం ఎకరానికి రూ. 7 లక్షలుగా నిర్ణయించారు. దీనికి అదనంగా మరో రూ. 14 లక్షలు ఇస్తారు. మొత్తంగా రూ. 21 లక్షలు వచ్చినా దీనికి గ్రామంలో ఏదైనా వ్యవసాయ భూమి కొనాలంటే రూ. 0.10 సెంట్లు కూడా రాదు. ఇక తమలాంటి చిన్నరైతులు ఏం తినాలి.. ఎలా బతకాలి.

జీవిత కష్టార్జితం పోతోంది.. - విజయలక్ష్మి, చిల్లకూరు

నా భర్త ఉద్యోగ విరమణ తర్వాత మా భూమిలో రూ. 45 లక్షలతో సొంతింటి కలల గూడు కట్టుకున్నాం. రహదారి విస్తరణ పేరిట ముందుగా సగభాగం పోతుందని అంచనా వేశారు. ఆ తర్వాత ఇంటి పక్కనే ఉన్న మరో గది కూడా పోతుందని మార్కింగ్‌ వేశారు. మొత్తంగా 23 అంకణాల్లో ఇంటికి లక్షలు పెట్టినా పరిహారం ఎంత ఇస్తారని ఇప్పటికీ చెప్పలేదు. ఇలా మా జీవితాంతం కష్టపడ్డ సొమ్ములు బూడిదలో పోసినట్లయ్యింది. వారిచ్చే పరిహారంతో స్థలం కూడా వచ్చే పరిస్థితి లేదు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

రైతుల భూ పరిహారం విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. అంతా నిబంధనల మేరకు గ్రామాల వారీగా లెక్కలేశారు. అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు. ప్లాట్‌లు, ఇళ్ల స్థలాలకు వేర్వేరుగా అధికారులు అంచనాలు చేశారు. -- సరోజిని, ఆర్డీవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.