నెల్లూరు జిల్లా పెద్దకోనలో వెలసిన శ్రీ లక్ష్మీ సమేత యోగ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు స్వామి వారి కల్యాణం కమనీయంగా జరిగింది. పెంచలకోన ఆలయ అర్చకులతోపాటు, తితిదే వేదపండితులు విచ్చేసి స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలిరావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు సాగే ఉత్సవాల్లో రేపు స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
భక్తిశ్రద్ధలతో శ్రీ లక్ష్మీ సమేత యోగ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు - nellor
నెల్లూరు జిల్లా పెద్దకోనలో వెలసిన శ్రీ లక్ష్మీ సమేత యోగ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామి వారి కల్యాణం కమనీయంగా నిర్వహించారు.