ETV Bharat / state

పోలేరమ్మా... మమ్ము కరుణించమ్మా...!

వెంకటగిరి పోలేరమ్మ జాతర నేటితో ముగుస్తున్నందున భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

జాతర
author img

By

Published : Sep 19, 2019, 7:10 PM IST

పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఈ రోజు ముగింపు సందర్భంగా.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కిలో మీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలిచే పోలేరమ్మను దర్శించుకునేందుకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చారు. మంత్రులు అనిల్​ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు.
రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 800 మంది పోలీసులను మోహరించారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 78 సీసీ కెమెరాలు, 1 డ్రోన్​తో రక్షణ చర్యలు చేపట్టారు. వాకాడు, గూడూరు, సూళ్లూరుపేట డిపోల నుంచి 50 బస్సు సర్వీసులు నడుపుతున్నారు. వెంకటగిరి ఆర్టీసీ డిపో నుంచి 82 బస్సులు నడుపుతున్నారు. 1714 సంవత్సరం నుంచి ఇక్కడ జాతర జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది.

Intro:కొనసాగుతున్న గాలింపు చర్యలు. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం జరిగిన చోట మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి ప్రత్యేక బలగాలు గోదావరి లో మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మధ్యాహ్న సమయం లో కచ్చులూరు వద్ద వర్షం పడడంతో గాలింపు చర్యలకు కొంత సమయం అవాంతరం ఏర్పడింది.

Body:యతిరాజులు, గోకవరం మండలం, జగ్గంపేట నియోజకవర్గ, తూర్పుగోదావరి జిల్లా

Conclusion:8008622066

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.