ETV Bharat / state

అవినీతి కొత్త కాదు.. మేమేమీ సత్యవంతులం కాదు: వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

Corruption Is Not New.. We Are Not Truthful: కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవినీతి కొత్తకాదు.. మేం సత్యవంతులమని చెప్పట్లేదు. ఇప్పటికన్నా గత ప్రభుత్వంలోనే అవినీతి ఎక్కువ జరిగింది. టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర రూ.400 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు.

MLA Ramireddy Pratap Kumar Reddy
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
author img

By

Published : Jan 30, 2023, 9:23 AM IST

Updated : Jan 30, 2023, 10:29 AM IST

Corruption Is Not New.. We Are Not Truthful: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవినీతి కొత్తేమీ కాదని.. మేమేమీ సత్యవంతులమని చెప్పడం లేదని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి కన్నా ఎక్కువగా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో బీద రవిచంద్ర రూ.400 కోట్ల వరకూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తమ పాలనలో జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలన్నీ పేదల ఇళ్ల అవసరాలకేనని పేర్కొన్నారు. అదే గతంలో బీద సహా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గ్రావెల్‌ దోపిడికి పాల్పడ్డారని తెలిపారు. ఆదివారం కావలిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్కడక్కడా పురపాలక అధికారులపై విమర్శలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై అలాంటి ఆరోపణలకు తావులేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు పురపాలక అధికారులు మామూళ్లు డిమాండు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

మేమేమీ సత్యవంతులం కాదు

ఇవీ చదవండి

Last Updated : Jan 30, 2023, 10:29 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.