కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో నెల్లూరు జిల్లా నిర్మానుష్యంగా మారింది. నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు... రాకపోకలను అడ్డుకుంటున్నారు. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాణిజ్య సముదాయాలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. ప్రధాన ఆసుపత్రులు తప్ప మిగిలినవన్నీ మూతపడ్డాయి. రోగులకు అవస్థలు తప్పడం లేదు.
కొంతమంది వైద్యులు రాసిన మందులు వారి హాస్పిటల్స్ లోనే దొరికే అవకాశం ఉండటం, అవి బయట దొరకని పరిస్తితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పలువురు యువకులు ఏ దిక్కు లేని వారికి ఆహారం పొట్లాలు అందిస్తూ ఆదుకుంటున్నారు. పెళ్ళకూరు మండలం రోసనూరులోకి ఇతర గ్రామస్థులు రాకుండా రోడ్డును దిగ్భంధం చేశారు. బయట వ్యక్తులు ఎవరూ కరోనా సమస్య పరిష్కారం అయ్యేంత గ్రామంలోకి రావద్దని పోస్టర్లు అంటించారు. చుట్టూ కంపలు వేసి దారులు మూసేశారు.
ఇవీ చూడండి: