ETV Bharat / state

ఆమె చదివింది ఎనిమిదే.. కానీ బ్యాంక్ ఛైర్‌పర్సన్ అయ్యింది..!

ఆమె చదివింది 8వ తరగతే అయినా.. సమాజాన్ని చదివించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తోటి మహిళల్లో అక్షర జ్ఞానం నింపి.. కుటుంబంతో పాటుగా సమాజంలోనూ అక్షర దీపం వెలిగించాలని నిర్ణయించుకుంది. చదువుతోపాటు పొదుపు పాఠాలు నేర్పి.. మహిళలను వ్యాపార మార్గంలో నడిపిస్తోంది. మహిళా బ్యాంకును ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తూ స్వయం సమృద్ధి దిశగా ప్రోత్సహిస్తున్న జాన్ బీబీపై ప్రత్యేక కథనం.

John Bibidi founded the Women's Bank
John Bibidi founded the Women's Bank
author img

By

Published : Mar 13, 2022, 3:30 PM IST

నెల్లూరు జిల్లా లేగుంటపాడుకు చెందిన జాన్ బీబీది ముస్లిం కుటుంబం. 8వ తరగతి పూర్తయ్యాక.. 13ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. ఆమె భర్త కూలీ పనులు చేసేవారు. వెనకబడిన ప్రాంతంలో ఉండే పరిస్థితులను గమనించి అక్షరాస్యత పెరిగితే సమస్యలు పరిష్కారమవుతాయని భావించింది. మహిళలకు రాత్రి పూట చదువు చెప్పటం ప్రారంభించింది. ఆ సమయంలో సారా వల్ల ఇబ్బందులు పడుతున్న కుటుంబాల గురించి తెలుసుకుని మహిళల్లో చైతన్యం నింపింది. సారా ఉద్యమాన్ని నడిపింది. సారా వ్యాపారం మూతపడటంతో.. ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. దీంతో వందలాది మంది మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి.

ఆమె చదివింది ఎనిమిదే... కానీ బ్యాంక్ ఛైర్‌పర్సన్ అయ్యింది

మహిళా బ్యాంకును ప్రారంభించిన జాన్ బీబీ..
పొదుపుపై అవగాహన పెంచుకుని.. రోజుకో రూపాయి చొప్పున బ్యాంకులో దాచుకునేలా మహిళలకు జాన్‌బీబీ నేర్పించింది. కోవూరు ఆంధ్రా బ్యాంకు ద్వారా మహిళలకు రుణాలు ఇప్పిస్తూ.. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించింది. వేలాదిగా మహిళలు ముందుకు రావటంతో.. తమ పొదుపు నిధులతో తామే ఓ బ్యాంకును నిర్వహించాలని జాన్‌ బీబీ ఆలోచించారు. 1998 అక్టోబర్ 30న లేగుంటపాడులో మహిళా బ్యాంకును ప్రారంభించారు. మహిళలతోపాటు విద్యార్థులు కూడా బ్యాంకులో డబ్బులు దాచుకునే అవకాశం కల్పించారు. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ కూడా వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు.

స్వయం సమృద్ధి సాధించాలన్నదే లక్ష్యం..
మహిళా బ్యాంకు సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేసి... ఏడాదికి రెండు కోట్ల రూపాయల రుణాలను అందిస్తున్నారు. బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకుని జీవనోపాధి పొందుతున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పది పొదుపు సంఘాలతో ప్రారంభమై... ప్రస్తుతం 800 సంఘాలు ఏర్పడ్డాయని జాన్‌బీబీ తెలిపారు. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నది తన ధ్యేయమని చెబుతున్నారు. లేగుంటపాడు మహిళా బ్యాంకును స్ఫూర్తిగా తీసుకుని... జిల్లాలో మరో 8మహిళా బ్యాంకులు ఏర్పాటయ్యాయి.

ఇదీ చదవండి: Gavimatam Temple: వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం.. రథాన్ని లాగిన గజలక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.