ఇసుక కొరతపై నెల్లూరులో జనసేన పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఇసుకను నోట్ల కట్టలతో తూకం వేసి ధర్నా చేపట్టారు. నగరంలోని కనకమహల్ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో 30 లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నా... ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నెలకు రూ.10వేలు పరిహారంగా ఇవ్వాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీచూడండి