నెల్లూరు జిల్లా కావలి మండలంలోని తుమ్మలపెంట గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు వారణాసి దుర్గాప్రసాద్. విద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటుతూ పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. 61వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. 2019కి గాను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసి, గుంటూరు వైఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు సన్మానించారు. ఇదే విద్యాలయంలో చదివిన విద్యార్ధుల సహకారంతో గురుకుల శాట్ అనే పూర్తి స్థాయి ఉపగ్రహాన్ని తయారు చేసి ఇస్రో ద్వారా రోదసిలోకి పంపడమే తన కోరికంటున్నారు దుర్గాప్రసాద్.
ఇవీ చూడండి..సర్పాల సయ్యాట... చూపరులకు కనువిందట..!