నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నాలుగు రోజుల్లో పెరగడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. హత్య కేసులో ఆరుగురు నిందితులను గత నెల 29న వెంకటగిరి సర్కిల్ ఆఫీస్లో అరెస్టు చూపి జైలుకు పంపారు. వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో... చికిత్స నిమిత్తం జైలు నుంచి ఆసుపత్రిలో చేర్చారు. సర్కిల్ పరిధిలోని పోలీసులకు కరోనా పరీక్షలు చేశారు. వెంకటగిరి బాలాయపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 26 మందికి పాజిటివ్ వచ్చింది. పట్టణంలో ఇప్పటికే ఎనిమిది వార్డుల్లో కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు నిర్ధరించి... కట్టడి చర్యలు అమలు చేస్తున్నారు. పోలీసులకు ఈ ఫలితాలు రావాల్సి ఉండడంతో... ఇంకా ఎంతమందికి పాజిటివ్ వస్తుందో అని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
పాజిటివ్ వచ్చిన వారి అనుబంధ వ్యక్తులను, వారితో కాంటక్ట్ అయిన వ్యక్తులకు వైద్యశాఖ ఆధ్వర్యంలో నమూనలను సేకరిస్తున్నారు. ఈ ఫలితాలు రావటంలో జాప్యం జరుగుతోందని... బాధిత వర్గాలు అంటున్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా కట్టడి చర్యలను మరింత పటిష్టం చేసే దిశగా ఉన్నతాధికారులు చేస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న కుటుంబాలకు నిత్యవసరాలు అందించాలని పలువురు కోరుతున్నారు.