ETV Bharat / state

ఇంకా అసంపూర్తిగానే నాడు-నేడు పనులు - incomplet building works in nadu nedu news

కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు నవంబర్ రెండు నుంచి తెరిచేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో అడుగు పెట్టబోతున్న విద్యార్ధులకు సమస్యలు స్వాగతం పలకబోతున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్ధులు తరగతి గదుల్లోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే ఇందుకు బిన్నంగా కనిపిస్తుంది. భవనాల నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం తరగతి గదులు, పాఠశాలల ఆవరణాలు ఆపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి.

incomplet building works in nadu nedu works
ఇంకా అసంపూర్తిగానే నాడు-నేడు పనులు
author img

By

Published : Oct 27, 2020, 3:00 PM IST

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పనుల్లో భాగంగా 1060 ప్రభుత్వ పాఠశాల భవనాలను మరమ్మతులు చేస్తున్నారు. ఇందుకు గాను జిల్లాకు 213 కోట్లు నిధులు కేటాయించారు. ఇప్పటివరకు జరిగిన పనులకు 96 కోట్ల రూపాయలు వరకు చెల్లించారు. అయితే మధ్యలో బిల్లులు రావడం ఆలస్యంకావడం.. పనులు కొన్ని రోజులు నిలిచిపోయాయి. మరోవారం రోజులు వర్షాల కారణంగా పనులు నిలిపేశారు. దీంతో పాఠశాలల తెరుచుకునే సమయానికి పనులు పూర్తి అవుతాయా లేదా అనే అనుమానాలు ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్ధులు వస్తారా...

పాఠశాలల్లో మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. తరగతి గదుల్లో దెబ్బతిన్న కిటీకీలు, ఆరుబైట బండపరుపు, విద్యుత్ పనులు వంటి ముఖ్యమైన పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటికే తొమ్మిది, పదితరగతులకు బోదన ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా... 10శాతం మంది విద్యార్ధులు కూడా హాజరు కావడంలేదు. జిల్లావ్యాప్తంగా 2.51 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యానభ్యసిస్తున్నారు. ఇలాంటి సమయంలో పాఠశాలలు తెరుచినప్పటికీ విద్యార్ధుల సంఖ్య పెరిగే పరిస్థితి మాత్రం కనిపించడంలేదు.

తల్లిదండ్రులకు అవగాహన..

ఇదే అంశంపై జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించడం, మరుగుదొడ్లు నిర్వహణ. తరగదులు శుభ్రం చేయడం వంటి పనులు చేయించమని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు గ్రామాల్లో విద్యార్ధుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇంకా అసంపూర్తిగానే నాడు-నేడు పనులు

భరోసా ఇస్తున్న అధికారులు...

మరో పన్నెండు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. సమయం తక్కువ ఉంది. నాడు నేడు పనులు మాత్రం మిగిలే ఉన్నాయి. భవన నిర్మాణం పనులు అసంతృప్తిగా ఉండటం.. పాఠశాల వాతావరణం మట్టిరాళ్ళతో అపరిశుభ్రంగా కనిపిస్తుంది. అధికారులు మాత్రం పనులు పూర్తి చేస్తామని. నూతన భవనాల్లో తరగతులు కొనసాగుతాయని భరోసా ఇస్తున్నారు.

ఇవీ చూడండి...

వ్యవసాయంలో లాభాలు ఎలా?.. సీడ్స్​ సంస్థ చెబుతోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.