'అక్రమ మద్యం కేసులో పట్టుబడితే ఇకపై స్టేషన్ బెయిల్ ఉండదు' - illegal liquor at nellore district latest news
నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడినా.. గొలుసు అమ్మకాలు చేపట్టినా కఠిన శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల నుంచి 172 తమిళనాడు మద్యం సీసాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు రాయపు వెంకటేశ్వర్లు ఇంటివద్ద గడ్డివాములో దాచిన 124 మద్యం సీసాలను, రమేష్ అనే వ్యక్తి ఇంటిలో 48 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీధర్ బాబు సీవాకాడులోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో తెలిపారు. ఇకపై ఒక్క వ్యక్తి వద్ద నాలుగు మద్యం బాటిళ్లు దొరికినా స్టేషన్ బెయిలు కూడా ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. నేరం రుజువైతే 2 లక్షల రూపాయలు జరిమానాతో పాటు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని వారు హెచ్చరించారు.
ఇవీ చూడండి..