ETV Bharat / state

భారీగా అక్రమ మద్యం పట్టివేత.. అదుపులో నిందితులు - కర్నూలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ సిబ్బంది సోదాలు కొనసాగుతున్నాయి. మద్యం అక్రమ రవాణాను నిలువరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ మద్యం పట్టివేత
అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Aug 8, 2021, 5:29 PM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మద్యం రవాణాపై సెబ్ అధికారులు ఉక్కు పాదం మోపారు. మినగల్లు, పాత దేవరాయ పల్లి గ్రామాల పరిధిలో సోదాలు చేశారు. మినగల్లు వద్ద ఆటోలో తరలిస్తున్న 400 మద్యం బాటిళ్లు స్వాధీనం చెసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆటోను సీజ్ చెశారు. వీరు కర్ణాటక నుంచి మద్యం తీసుకుని వచ్చి బెల్టుషాపులకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు.. పాతదేవరాయ పల్లి గ్రామంలో గడ్డి వామిలో నిల్వ వుంచిన 120 మద్యం బాటిళ్ళను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

కర్నూలులో..

రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు తెలంగాణ రాష్ట్ర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​ నుంచి కర్నూలుకు వస్తున్న కారును సెబ్ సీఐ తనిఖీ చేశారు. తెలంగాణ నుంచి తీసుకొస్తున్న 180 మద్యం సీసాలను గుర్తించారు. మద్యం తరలిస్తున్న.. కోడుమూరు నియెజకవర్గంలోని సనగండ్లకు చెందిన తెలుగు రాజేష్, తెలంగాణకు చెందిన అఖిల్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

'దొంగతనం నెపంతో పోలీసులు చిత్రహింస పెట్టారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.