కోవిడ్‌తో బాధపడుతున్న భార్యను.. కట్టుకున్న భర్తే హతమార్చాడు. ఈ ఘటనపై.. నెల్లూరు జిల్లా కావలి సీఐ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. గత నెల 25న కోవిడ్ సోకిన దంపతులు మాల్యాద్రి, అనూరాధ.. నెల్లూరు జిల్లా కావలిలో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం భార్య శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. సాయం కోసం 108కి ఫోన్ చేశారు. ఎంతకూ రాకపోవడంపై వారి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో.. ఇరువురూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
ఇదీ చదవండి: త్వరలోనే జగన్ దిల్లీ పెద్దలను కలిసే అవకాశం: ఎంపీ రఘురామ
ఈ క్రమంలో అనూరాధ చేతి మణికట్టును మాల్యాద్రి బ్లేడుతో కోసి.. అనంతరం తనూ అదే పని చేశాడు. భార్య మరణించగా స్పృహలోకి వచ్చిన మాల్యాద్రి.. ఆమె మృతికి తనే కారణంటూ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉండగా.. భార్యాభర్తలకు కరోనా సోకటంతో వారిని బందువులు ఇంటికి పంపించారు.
ఇదీ చదవండి: