Wife murdered by husband: నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం చోటుచేస్తుంది. స్థానిక నిమ్మ మార్కెట్ వద్ద నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే భార్యను భర్త కిరాతకంగా నరికి పరారయ్యాడు. భార్య అక్కడికక్కడే మృతి చెందింది. శేఖర్, వెంకటలక్ష్మి దంపతులు. వెంకటలక్ష్మి స్థానిక నిమ్మకాయల దుకాణంలో పనిచేస్తుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో శేఖర్.. భార్య వెంకటలక్ష్మిని దారుణంగా హత్య చేసి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు 2వ పట్టణం పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
నడిరోడ్డుపై కిరాతకంగా భార్యను హత్య చేసిన భర్త - Husband Killed wife at gudur
Husband kills wife in Nellore District: నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన దారుణ హత్య స్థానికుల్లో కలకలం రేపింది. స్థానిక నిమ్మ మార్కెట్ వద్ద నడిరోడ్డుపై భార్యను అతి కిరాతకంగా నరికి హతమార్చాడు ఓ భర్త.