ETV Bharat / state

Heavy Rains in State: విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - Videos and Photos of Rain In Andhra Pradesh

Heavy Rains in State: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంలో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధిక వర్షాలకు వరి నారుమళ్లు నీటమునిగాయని రైతులు వాపోతున్నారు.

Rains in state
రాష్ట్రంలో వర్షాలు
author img

By

Published : Jul 25, 2023, 8:38 PM IST

అనకాపల్లి జిల్లా జలశయాలకు వర్షపు నీటితో జలకళ

Heavy Rains in State : ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. రేపటిలోగా ఇది వాయుగుండంగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు రాజస్థాన్​లోని జైసల్మేర్ నుంచి దక్షిణ ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకూ విస్తరించిన రుతుపవన ద్రోణి కూడా క్రియాశీలకంగా మారినట్టు ఐఎండీ తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిశాయి. తిరువూరు నియోజకవర్గంలోని కట్టలేరు, ఎదుళ్ల, పడమటి, గుర్రపు, విప్ల, కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందులు తెలెత్తాయి. పామర్రు మండలంలో వరి నారుమళ్లు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గన్నవరంలో పలు కాలనీలు నీట మునిగాయి. దావాజీగూడెం, ముస్తాబాద, ఇందుపల్లి జెడ్పీ పాఠశాలల ఆవరణలోకి భారీగా వరద నీరు చేరింది. పెనుగంచిప్రోలు-జగ్గయ్యపేట రహదారిపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు నిలిచింది. మచిలీపట్నంలో లోతట్టు కాలనీలు ముంపునకు గురయ్యాయి.

హెచ్చరిక: మున్నేరు వరద ఉధృతిపై జల వనరుల శాఖ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో లింగాల వద్ద వంతెన పైకి వరద నీరు చేరనుందని హెచ్చరిక జారీ చేసారు. పోలంపల్లి ఆనకట్ట వద్ద నుండి దిగువకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వదులుతున్నారు.

పడవలపై రాకపోకలు : డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద నెమ్మదిగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడిచిపెడుతున్న వరద నీరు కాస్త తక్కువగా ఉండటంతో దిగువన ఉన్న కోనసీమలోని గౌతమి వశిష్ట వైనితేయ గోదావరి నది పాయల్లో సోమవారం కంటే వరద ప్రవాహం కాస్త తగ్గింది కనకాయలంక వద్ద కాజువే ముంపులోనే ఉంది వివిధ లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు ఇబ్బందులు : నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలోని శివారు కాలనీలు వర్షాలకు చిత్తడిగా మారాయి. కనీసం నడవటానికి కూడా అవకాశం లేదు. ద్విచక్రవాహనాలు రోడ్ల మధ్యలో దిగబడిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబునగర్, ఎన్టీఆర్ నగర్, తల్పగిరి కాలనీ, వైఎస్సార్ నగర్‌, రెవెన్యూ కాలనీ, కొత్తూరు తదితర కాలనీల్లో రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు. నగర శివారు కాలనీలు మరీ దారుణంగా ఉన్నాయి. ప్రజల ఇబ్బందులను పరిశీలించడానికి, సమస్యలకు పరిష్కారం చూపడానికి కానీ కార్పొరేటర్లు, అధికారులు ఎవ్వరూ రావటం స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్షపు నీటితో కళకళలాడుతున్న జలాశయాలు : కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని పోలు జలాశయాల్లో స్వల్పంగా నీరు చేరుతోంది. దీనిలో భాగంగానే గొలుగొండ మండలం రావణపల్లి జలాశయంతో పాటు నాతవరం మండలం తాండవ రిజర్వాయర్, రావికమతం మండలం కళ్యాణపులావ జలాశయం, మాకవరపాలెం మండలం జాజిగడ్డ జలాశయాలలో నీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఖరీఫ్ రైతుల్లో ఆశలు మొదలై ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసి వ్యవసాయానికి సన్నద్ధమవుతున్నారు

అధికారులు మారుతున్నారు కానీ పరిస్థితులు మారడం లేదు : కడపలో సాయంత్రం ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండు, గ్యారేజ్​లోకి వర్షపు నీరు చేరింది. కోర్టు రోడ్డు, భరత్ నగర్ అక్కయ్యపల్లి, తదితర ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. మురికి కాలువలు పొంగి ప్రవహించాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఎంత మంది కమిషనర్లు, మేయర్లు మారినప్పటికీ కడప నగరంలోని మురికి వ్యవస్థను బాగు చేయలేకపోవడంతో ఈ వర్షానికి వర్షపు నీరంతా రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు.

వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

"రోడ్లు వేసవి కాలంలో మంచిగా ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ ఒకటే బురదమయం అయ్యాయి. వాహనదారులు జారి కింద పడుతున్నారు. మరో వైపు చెత్త వేసి అలాగే ఉంచారు. దీని కారణంగా దోమలు ఎక్కువగా వస్తున్నాయి. అధికారులు ఇప్పటికీ కూడా తగిన చర్యలు చేపట్టలేదు."- ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.