ఉద్యోగం వదిలి వ్యవసాయం వైపు అడుగుపెట్టిన యువరైతుకు నిరాశే మిగిలింది. సేంద్రీయ విధానంలో తొమ్మిది నెలలుగా కష్టపడిన పంట ఈదురుగాలుల పాలైంది నెల్లూరు జిల్లా గుంటకండీగ పంచాయతీ పరిధిలో ఈదురు గాలులకు యువ రైతు ఐదు ఎకరాల అరటితోట నేలకొరిగింది . పంట మరో నెల రోజుల్లో చేతికి అందే దశలో గాలి వాన బీభత్సం...యువరైతుని కోలుకోలేని దెబ్బ తీసేలా చేశాయి. నేలవాలిన అరటి చెట్లను చూసి కంటతడి పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. మరి కొన్నిచోట్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు రాలిపోయాయి. పంట నష్టాన్ని పరిశీలించిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు.
ఇవీ చూడండి-వారం రోజుల్లో ఏపీకి చెందిన భవనాలు తెలంగాణకు!