పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాలనుంచి భారీగా వరద నీరు చేరడంతో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. లక్షా 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు పెన్నా నదికి వదిలారు. పెన్నా నదీ పరవళ్లు తొక్కుతుండటంతో నది ప్రవాహం చూసేందుకు జనాలు తరలి వస్తున్నారు. నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్‌పై వాహనాల్లో వెళ్లేవారు.. పెన్నా నదిని చూస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి. రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా