నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 1.07 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా, ఖైనీలను పోలీసులు పట్టుకున్నారు. ఎన్టీఆర్ నగర్‌కి చెందిన వెంకట రామారావు గుట్కాలు, ఖైనీలు విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసుకు దాడులు నిర్వహించారు. నిందితుడు గతంలోనూ గుట్కా కేసులో ముద్దాయిగా ఉన్నట్లు బాలాజీనగర్ సీఐ సోమయ్య తెలిపారు. గుట్కా రవాణాపై పూర్తిస్థాయిలో విచారించి మరికొందరిని అరెస్టు చేస్తామన్నారు.
ఇది చదవండి అందని 'పెళ్లి కానుక'.. ఏడాదిగా నవ దంపతుల ఎదురుచూపులు