కరోనా విజృంభణతో సాధారణ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అష్టకష్టాలు పడి ఎలాగోలా ఆసుపత్రి వరకు వెళ్లినా వైద్య సేవలు మాత్రం అందడం లేదు. కరోనా కారణంగా రోగులను ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరిస్తుండటంతో రోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామం కొత్త హరిజనవాడకి చెందిన మస్తాన్(37) అనే వ్యక్తి వైద్యం అందక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నాడు. గుండె, నరాలవ్యాధితో బాధపడుతున్న మస్తాన్‌కు కరోనా కారణంగా సరైన వైద్యం అందడం లేదు. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని..లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పినట్లు అతని తల్లి శారదమ్మ తెలిపింది.
వైద్యం కోసం ఏ ఆసుపత్రి వెళ్లినా,...కరోనా ప్రభావంతో వారు చేర్చుకోవడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. 108కి ఫోన్ చేసిన స్పందించడంలేదని .... నిరుపేదలమైన తమకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమతలేదని ఆమె కన్నీటిపర్యంతమైంది. జిల్లా అధికారులు స్పందించి తమ బిడ్డను బతికించాలని ఆమె వేడుకుంటోంది.
ఇదీచూడండి.