అమరావతి రైతుల ఉద్యమానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. అమరావతి రైతులు 300 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 రోజులుగా రైతులు పిల్లాపాపలతో ఉద్యమం చేయాల్సిరావడం బాధాకరమని అన్నారు.
రాజధానిగా అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమర్ధించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ రాజధానిని మార్చడం తగదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: అలుపెరుగని అమరావతి ఉద్యమానికి 300 రోజులు