నెల్లూరు జిల్లాలో రైతు సమస్యలు తీర్చేందుకు టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శాఖ సంయుక్త సంచాలకులు శివ నారాయణ మాట్లాడుతూ...ఇప్పటివరకు జిల్లా నుంచి 307 సమస్యలు వచ్చాయని అందులో 30% పూర్తి చేశామని తెలియజేశారు. ప్రధానంగా ప్రధానమంత్రి పసల్ బీమా యోజన, రుణమాఫీ, రుణాలకు సంబంధించి సమస్యలు వస్తున్నాయని, ఆ సమస్యలను సంబంధిత శాఖలకు ఫోన్ చేసి పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలు టోల్ ఫ్రీ నెంబర్(1800-425-3363)కి ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం ఉపయోగించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి కశ్మీర్‌పై కాలమే సమాధానం చెబుతుంది: కేశినేని