ETV Bharat / state

హత్య కేసును ఛేదించిన పోలీసులు... ఐదుగురు అరెస్టు - kurnool district crime news

కర్నూలు జిల్లా కోస్గిలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 28న ఆదోని మండలం నాగలాపురం గ్రామానికి చెందిన నరసన్న అనే వ్యక్తిని వీరు కొట్టి చంపినట్లుగా పోలీసులు నిర్ధరించారు.

five members arrested on kosgi murder case in kurnool district
హత్య కేసును ఛేదించిన పోలీసులు... అయిదుగురు అరెస్టు
author img

By

Published : Mar 6, 2021, 6:59 PM IST

కర్నూలు జిల్లా కోస్గి గ్రామానికి చెందిన ఈరన్న, కోసిగయ్య, తాయన్న, హుసేన్​లు.. ఆదోని మండలం నాగలాపురం గ్రామానికి చెందిన నరసన్న అనే వ్యక్తిని కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 28న మండల కేంద్రంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న నరసన్న బహిర్భూమి కోసం సమీప పొలానికి వెళ్లాడు. నరసన్నను చూసి దొంగగా భావించిన నిందితులు అతడిని చితకబాదారు. ఈ ఘటనతో అస్వస్థతకు గురైన నరసన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా ఐదుగురిని అరెస్టు చేశారు.

ఇదీచదవండి.

'ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.