నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ చలపతిరావు అందించారు. సంబంధిత చెక్కును స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌కు అందజేశారు. జిల్లాలోని పది నియోజకవర్గాలకు సహాయం చేసేందుకు కలెక్టర్ అనుమతి కోరామని చలపతిరావు చెప్పారు. అనుమతి రాగానే ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. దాతలు ముందుకు వచ్చి పేదలకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీచదవండి.