సాగు భూములను ఇళ్ల స్థలాలుగా మార్చవద్దని కోరుతూ.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు రైతులు నిరసన తెలిపారు. పురుగుమందు డబ్బాలతో పొలాల్లో కూర్చుని నిరసన చేపట్టారు. 1977లో పేదలకు సీజేఎఫ్ఎస్ భూములను రైతులకు సాగు కోసం ఇచ్చారు. ఒక్కొక్కరికి 25 సెంట్లు కేటాయించగా.. మొత్తం 42మంది అన్నదాతలు ఆ భూముల్లో పంటలు పండించుకుంటున్నారు.
ఇప్పుడు వాటిని పేదలకు పంచడం కోసం ఇళ్ల స్థలాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని.. అలా చేస్తే తామేం కావాలంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సాగుభూమిని తీసుకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని వాపోయారు.
ఇవీ చదవండి... నాటుసారా కేంద్రాలపై దాడులు... 170 మంది అరెస్ట్