ప్రకాశం జిల్లాలో పరిహారం ఇవ్వకుండా భూములను దున్నడం అన్యాయం అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు గొట్టి పడియ, ఆక్కడెరువుతాండ గ్రామాలకు పునరావాసం, మార్కాపురం మండలంలోని కోమటికుంట సమీపంలో జమ్మనపల్లె గ్రామానికి వెళ్లే రహదారిలో సుమారు 84 ఎకరాలను భూసేకరణ కింద అధికారులు ఎంపిక చేశారు. ఇందులో 18 ఎకరాలకు చెందిన 12 మంది రైతులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం నచ్చకపోవడంతో 2018లో హైకోర్టుకు వెళ్లారు.
విషయం కోర్టులో..
అప్పటి నుంచి పరిహారం విషయం కోర్టులో నడుస్తోంది. అధికారులు మాత్రం రైతుల విషయం పట్టించుకోకుండా వారిని సంప్రదించకుండా రైతులకు చెందిన పరిహారాన్ని విజయవాడలోని ఆర్ అండ్ఆర్ కోర్టులో డిపాజిట్ చేసినట్లు అధికారులు రైతులకు తెలిపారు. మార్కెట్ ధరకంటే మూడు రెట్లు పరిహారం అందజేస్తేనే ఇస్తామని, అంతవరకు తమ భూమిలోకి దిగితే ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు గతంలోనే హెచ్చరించి పలుసార్లు ఆందోళన చేశారు. ఈనెల 26న 18 ఎకరాల్లో రైతులు సాగు చేసిన పత్తి పంటను అధికారులు ట్రాక్టర్ టిల్లర్తో పూర్తిగా దున్నేందుకు వచ్చారు. పంట ధ్వంసమవుతుంటే చూసి గొర్రెలను, మేకలను ఆ పొలాల్లోనే మేతకు వదిలారు.
1.2 ఎకరాలపై కనికరం..
18 ఎకరాల్లోని పంటను దున్నే ప్రక్రియను ఇటీవలే ప్రారంభించిన అధికారులు మిగిలిన పత్తి పంటను శనివారం దున్నేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో చేతికొచ్చిన ఒకటి, రెండు ఎకరాల పత్తి పంటను వదిలి పెట్టాలని రైతులు వేడుకోవడంతో వదిలిపెట్టారు. పత్తిని సేకరించిన తర్వాత ఆ పొలాన్ని కూడా దున్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ పరిణామాలతో రైతులు లబోదిబోమంటున్నారు.
పరిహారం ఇవ్వకుండా.. మధ్యలోనే చదును..
ఓ వైపు భూములకు పరిహారం ఇవ్వకుండా మరో వైపు సాగు చేసిన పంటను మధ్యలోనే దున్నేశారని కన్నీటి పర్యంతమవుతున్నారు. భూముల పరిహారం కోర్టుకు చెల్లించామని చెబుతున్న అధికారులు ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేసి సాగుచేసిన పచ్చని పత్తి పంట నష్టాన్ని ఎవరిస్తారని నిలదీస్తున్నారు. తక్షణమే భూములకు పరిహారంతో పాటు పంట దున్నినందుకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సమయమివ్వమని వేడుకున్నాం..
మాది నికరంపల్లె గ్రామం. సర్వే నెంబరు 746-1లో 2.83 ఎకరాల మామి ఉంది. ఖూసేకరణాకు సంతకాలు చేయలేదు. పరిహారం జవ్వకుండా భూములను దున్నడం అన్యాయం. కనీసం పంట కాలం వరకు సమయం ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు, కోర్టులో డిపాజిట్ చేశామంటే ఏవిధంగా తీసుకోవాలి. భూములకు పరిహారంతో పాటు పంట నష్టం కూడా చెల్లించాలి. పంట దున్నేయడం అన్యాయం.
- రాచకొండ శ్రీను, వేములకోట
మాది వేములకోట గ్రామం. సర్వే నెంబరు 746-9లో ఉన్న 081 సెంట్ల భూమే ఆదారం, ఈ భూమిని నిర్వాసితుల కాలనీకి భూసేకరణ కించ ఇవ్వలేదు. కనీసం సంతకాలు కూడా పెట్టలేదు. ఆవారు మంటూ రెందని అధికారులు తెలిపారు. కోర్టులో నడుస్తున్న భూముల విషయంలో లవంతంగా పచ్చని పంటలను దున్నేయడు అన్యాయం, అధికారులు భూములకు నష్టపరిహారంతో పాటు పంట దున్న నందుకు కూడా పరిహారం ఇవ్వాలి.
- రైతు
ఇవీ చూడండి : ప్రైవేటు విద్యాసంస్థల్లో 30 శాతం ఫీజులు తగ్గింపు ఉత్తర్వులు జారీ