నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచేసింది. జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
గాలి అధికంగా రావడంతో వారం పది రోజుల్లో కోతకు వచ్చే బత్తాయి తోటలు విరిగి కింద పడిపోయాయి. లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన పంట తీరా కోతకు వచ్చే సమయంలో ఇలా జరిగిందంటూ రైతులు బాధ పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మిర్చి, వరి పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లింది.
ఇదీ చదవండి: