ETV Bharat / state

రైతు భరోసా కేంద్రంలో రైతులకు వ్యవసాయ పరికరాలు - నెల్లూరులో రైతు భరోసా కేంద్రం

రైతు భరోసా కేంద్రంలో ప్రతి గ్రామంలో రైతులకు వ్యవసాయ పరికరాలను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు సాగులో ఉపయోగపడే పరికరాలకు ప్రభుత్వం రాయితీ అందిస్తోందని దానిని ప్రతి ఒక్కరూ వాడుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

farmer assurance center at nellore
రైతు భరోసా కేంద్రం
author img

By

Published : Aug 7, 2020, 8:00 PM IST

ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రణాళిక చేసిందని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో రైతుల గ్రూపులను ఏర్పాటు చేసి వారికి యంత్ర పరికరాలు ఇచ్చి వారి వద్ద నుంచి మిగతా రైతులకు అద్దెకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో 660 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతులను 60 గ్రూపులుగా ఏర్పాటు చేసి, ఈ గ్రూపులకు 12 నుంచి 15 లక్షల రూపాయలు విలువ చేసే యంత్ర పరికరాలు ఇస్తోందని ప్రసాద్ అన్నారు. ఇంకా కొన్ని పరికరాలు మిగతా రైతులకు అద్దెకు ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ రెండో తేదీ నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ గ్రూపులో ఐదు మంది రైతులు ఉండి ఓ గ్రూపుగా ఏర్పాటు కావచ్చని పేర్కొన్నారు.

ఎస్సీ ఎస్టీ రైతుల కోసం 110 గ్రూపులు ఏర్పరచుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఎస్సీ ఎస్టీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం కస్టమర్ ఐరింగ్ సెంటర్లకు(రైతుల గ్రూపులకు) ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇస్తోంది. 10 శాతం రైతులు కట్టాల్సి ఉంటుంది. 50% రుణం కేంద్ర సహకార బ్యాంకు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు

ఇదీ చూడండి. నది నీటిలో ఈతంట.. ఏ వ్యాయామం సాటిరాదంట..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.