నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండేళ్ల కిందట షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి భవనం దెబ్బతింది. నాటి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలను గ్రామంలోని ఒక ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారు. మందుల నిల్వలను మాత్రం పాత భవనంలోని ఓ గదిలో నిల్వచేసి ప్రతిరోజు ప్రైవేట్ భవనంకు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో వైద్యశాలలో కాలం చెల్లిన మందులతో పాటు గడువు తీరని మందులను కూడా.. కాల్చివేశారు. ఐవిసెట్గా ఉపయోగించే నీడిల్స్, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఉపయోగించే ద్రావణాలు... వైద్యశాల ఆవరణలోని కాల్చేసిన కుప్పల వద్ద దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా వినియోగకరమైన మందులను గడువు తీరకుండానే బూడిద పాలు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండీ.. సేంద్రీయ సాగులో లాభాల పంట