ETV Bharat / state

పచ్చని పల్లెల్లో.. సారా ప్రవాహం! - Excise branch holding Natusara heavily

పచ్చని పల్లెల్లో సారా వాసన గుప్పుమంటోంది. లాక్‌డౌన్‌తో జిల్లాలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దాంతో గుట్టుచప్పుడు కాకుండా పల్లెల్లోని అటవీ ప్రాంతాల్లో సారాబట్టీలు వెలిశాయి. కొన్నేళ్లుగా బిట్రగుంట ప్రాంతానికే పరిమితమైన సారా తయారీ కేంద్రాలు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని పల్లెలకూ విస్తరించాయి. 38 రోజుల కిందట మద్యం దుకాణాలు, బార్లు మూసివేయటంతో ప్రస్తుతం మందుబాబులు సారా, కల్లు కోసం ఎగబడుతున్నారు. ఈ గిరాకీని గుర్తించిన కొందరు అక్రమార్కులు నాటుసారా తయారు చేస్తున్నారు.

nellore  district
కావలి అటవీ ప్రాంతంలో పట్టుకున్న 800 లీటర్ల సారా
author img

By

Published : Apr 30, 2020, 12:13 PM IST

నెల్లూరు జిల్లాలో సారా ఎరులై పారుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చనే దురాలోచనతో కొందరు అక్రమార్కులు సారా కాస్తున్నారు. పల్లెల్లోని శివారు ప్రాంతాలను ఎంపిక చేసుకొని బట్టీలు ఏర్పాటుచేసి ముందుగా బెల్లం ఊటను సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో లీటరు సారా రూ.200 ఉండగా.. ప్రస్తుతం రూ.1500 వరకు పలుకుతోంది. గత వారం వరకు జిల్లాలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న సందర్భాలున్నాయి.

క్వార్టర్‌ సీసాను వేల రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆదేశాలతో ఎక్సైజ్‌ శాఖలో కదలిక వచ్చి పరిశీలనకు పూనుకుంది. ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలోని సరకును ఆశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. దాంతో సరకు లెక్కలు తేలడంతో దాదాపు మద్యం అక్రమ అమ్మకాలు నిలిచిపోయాయి.

ఇటీవల ఆత్మకూరులోని ఓ బారులో ఆశాఖ అధికారులు జరిపిన పరిశీలనలో గతనెల 21వ తేదీ రాత్రి దుకాణం మూతపడే మూడుగంటల ముందు 650 సీసాలు తాగేశారని, మరసటిరోజు నుంచి లాక్‌డౌన్‌ ఉందనే హడావుడితో బారులో స్టాక్‌ వివరాలు నమోదు చేయలేకపోయామని బారు నిర్వాహకులు చెప్పిన మాటలనే ఎక్సైజ్‌శాఖ అధికారులు సైతం నివేదికలో పేర్కొనటం విమర్శలకు తావిచ్చింది. బారు పరిశీలనలో జరిగిన పలు అంశాలను అధికారులు పూర్తి గోప్యంగా ఉంచినా మధ్యవర్తి నివేదికతో అసలు గుట్టు రట్టయ్యింది.

*పట్టుబడిన సారా (లీటర్లలో) 64

*పట్టుబడిన బెల్లం ఊట (లీటర్లలో) 3,500

*సీజ్‌ చేసిన వాహనాలు 5

*నమోదైన కేసులు 16

*అరెస్టయిన వ్యక్తులు 16

ఎక్సైజ్‌కు సారా సవాల్‌

ప్రస్తుతం జిల్లాలో ఎక్సైజ్‌ అధికారులకు సారా సవాల్‌ విసురుతోంది. అక్రమ మద్యం అమ్మకాలు, సారా, కల్లు వంటి మత్తు పదార్థాలపై నిఘా ఉంచాలని, వాటిని ఎక్కడికక్కడ నియంత్రించాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ మూడు రోజుల కిందట ఆదేశించారు. దాంతో అప్పటి వరకు నామమాత్రంగా స్పందిస్తున్న ఎక్సైజ్‌ అధికారులు.. పల్లెల్లో దాడులు విస్తృతం చేశారు. ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒక చోట సారా, బెల్లం ఊటను స్వాధీనం చేసుకుంటున్నారు.

మంగళవారం బిట్రగుంట ప్రాంతంలో 60 లీటర్ల సారా కోసం సిద్ధం చేసిన బెల్లం ఊటను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ పోలీసులు గుర్తించారు. వింజమూరులోనూ దాడులు నిర్వహించి బెల్లం ఊటను పట్టుకున్నారు. డక్కిలి మండంలో వడ్డిపల్లి గ్రామశివారు ప్రాంతంలో సారా తయారు చేసేందుకు ఉన్న కేంద్రాలను గుర్తించి పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేశారు. బుధవారం కావలి నియోజకవర్గం పరిధిలోని బిట్రగుంట రిజర్వు అటవీ ప్రాంతం తాళ్లూరు సమీపంలో 800 లీటర్లు మాగిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

పట్టుబడుతోంది బెల్లం ఊటలే..

ఇప్పటి వరకు అధికారులు చేసిన దాడుల్లో కేవలం తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం ఊటలు మాత్రమే పట్టుబడుతున్నాయి. సీతారామపురంలో ఇద్దరు వ్యక్తుల నుంచి ఎనిమిది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 3,500 లీటర్ల బెల్లం ఊట, 64 లీటర్ల సారాను ఎక్సైజ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వందల లీటర్లు బెల్లం ఊట పట్టుబడుతున్న చోట.. ఆ స్థాయిలో సారా ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్సైజ్‌శాఖలోని 15 సర్కిళ్ల పరిధిలో నిఘా లేకపోవడంతోనే ఆయా ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు విస్తరిస్తున్నాయి. 15 మంది సీఐలతో పాటు ఆయా స్టేషన్ల ఎస్సైలు, ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం, నెల్లూరు, గూడూరు సూపరింటెండెంట్ల పరిధిలో రెండు స్క్వాడ్‌ బృందాలు పనిచేస్తుంటాయి. అయినా 10 లీటర్ల నుంచి 60 లీటర్లు, 80 లీటర్లు సారా తయారీ కేంద్రాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తరించడం ఎక్సైజ్‌ నిఘా వ్యవస్థ డొల్లతనాన్ని అద్దం పడుతున్నాయి.

నిత్యం తనిఖీలు చేస్తున్నాం

జిల్లాలో సారా తయారు చేసే కొన్ని ప్రాంతాలపై పూర్తి నిఘా ఉంచామని రాధయ్య, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తయారీకి సిద్ధంగా ఉన్న ఊటలను ధ్వంసం చేశామని అన్నారు. శివారు గ్రామ ప్రాంతాలు, అడవుల్లో ఈ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంపై దాడులు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే బిట్రగుంట, కావలి, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేసి బెల్లం ఊటను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశామని అన్నారు.​​​​​​​

ఇదీ చదవండి:

నీరు విడుదల చేశారు.. కాలువల్లో పూడిక తీయడం మరిచారు..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.