మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనారోగ్యంగా ఉన్నా.. విచారణ పేరుతో అనిశా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు.
గ్రామస్థాయి నుంచి అరాచకాలు పెరుగుతున్నాయని కురుగొండ్ల రామకృష్ణ దుయ్యబట్టారు. వెంకటగిరిలో 15 ఏళ్ల క్రితం టైలర్లకు, తాపీమేస్త్రీలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు.. నేడు చదును చేసి అదే భూములకు మళ్లీ పట్టాలు ఇవ్వడం విచారకరమని రామకృష్ణ అన్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో మరో 605 కరోనా కేసులు... 10 మంది మృతి