ETV Bharat / state

కాల్​ సెంటర్ పనితీరు భేష్​..ఆపత్కాలంలో మెరుగైన సేవలు

ఓర్పుతో సమస్యలు వింటే.. ఫిర్యాదులు ఎందుకు వస్తాయని అంటారు వారు. నాలుగు నెలలుగా కొవిడ్ కాల్​ సెంటర్​లో పని చేస్తున్న వీరు... తమది ఉద్యోగమే కాదు.. ఓ బాధ్యత అంటున్నారు. వీరికి ఉన్న నిబద్ధత వలనే... నెల్లూరు కాల్​ సెంటర్​ పట్ల ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయటం లేదు ఈ జిల్లా వాసులు. 1077కి టోల్​ ఫ్రీ నెంబర్​కి ఫోన్ చేయండి.. మీకు మార్గం చూపిస్తాం అంటున్న నెల్లూరు కాల్​ సెంటర్​ సిబ్బందిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

నాలుగు నెలలుగా ఎటువంటి ఫిర్యాదు లేని కాల్​ సెంటర్!

author img

By

Published : Aug 5, 2020, 4:49 PM IST

నాలుగు నెలలుగా ఎటువంటి ఫిర్యాదు లేని కాల్​ సెంటర్!

కరోనా పాజిటివ్ బాధితుల కోసం కాల్​ సెంటర్లు నిరంతరం పని చేస్తున్నాయి. నాలుగు నెలలుగా బాధితులకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. కాల్​ సెంటర్​లో పని చేసే ఉద్యోగులు ఎంతో ఓర్పుగా.. ప్రజల సమస్యలు విని, ప్రతి ఒక్కరికీ పరిష్కారం చూపిస్తున్నారు.

మాది ఉద్యోగమే కాదు.. బాధ్యతనీ.. సేవా భావంతో పని చేస్తున్నామంటున్నారు నెల్లూరు కాల్​ సెంటర్​లో పని చేసే సిబ్బంది. పని పట్ల ఇంత నిబద్ధత ఉండటంతోనే.. కాల్​ సెంటర్​పై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదంటున్నారు.

జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కాల్​ సెంటర్​లో... మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ఈ కాల్​ సెంటర్ ముగ్గురు జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఉంది.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు గానీ... బాధిత బంధువులు గానీ కొంత కంగారుగా ఉంటారు. కాల్​ సెంటర్​కి వారు ఫోన్ చేయగానే.. సిబ్బంది బాధితులకు ధైర్యం చెప్తారు. బాధితులను ఇంటి దగ్గర నుంచి, కొవిడ్ కేర్ ఆసుపత్రిలో చేర్చేంత వరకు కాల్​ సెంటర్ ఉద్యోగులు వారికి ఫోన్​లో అందుబాటులోనే ఉంటారు.

ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేయటం జరిగింది. షిఫ్ట్​కి ఐదుగురు చొప్పున, మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 6,210 కాల్స్ వచ్చాయి. 104 కోసం 80 మంది ఫోన్ చేశారు. - వీరాస్వామి నోడల్ అధికారి

ఆసుపత్రుల్లో వైద్య సేవలు సరిగా లేవనీ.. కరోనా టెస్టులు సరిగ్గా చేయటం లేదనీ ఫిర్యాదులు వస్తుంటాయి. విదేశాల నుంచి వస్తున్న వారు కూడా కాల్​ సెంటర్​కి సమాచారం అందిస్తున్నారు. గ్రామాల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరటం.. సంజీవని బస్సులు వచ్చే ప్రాంతాల విషయాలను తెలుసుకోవటం కోసం ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నారు.- భారతీ, సోషల్ సైన్స్ లెక్చరర్

ఇదీ చదవండి: 'హిందూ సంప్రదాయానికి ఆధునిక చిహ్నం రామాలయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.