నెల్లూరు జిల్లా గూడూరు గాంధీనగర్ లో సమగ్ర వ్యవసాయ పరిశోధనా భనన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగితోందన్నారు. ముఖ్యమంత్రి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ రైతుల శ్రేయస్సుకు పాటు పడుతున్నారన్నారు. రైతులకోసం ధరల స్థిరీకరణ, విపత్తు కోసం 5000 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇకపై నియోజకవర్గంలోని రైతులందరూ వ్యవసాయానికి సంబంధించిన పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదని,అన్ని రకాల పరీక్షలు ఇక్కడి ఈ పరీక్ష కేంద్రంలోనే నిర్వహిస్తామన్నారు.

యాభై ఐదు లక్షల రూపాయలతో అత్యాధునిక పరికరాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో రైతులకు భూసార,విత్తన పరీక్షలు ఇక్కడ అందుబాటులో ఉండేలా చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వెంకటగిరిలో ఎన్టీఆర్ జయంతి