నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం సమీపంలో హిటాచి యంత్రాన్ని తరలిస్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న హిటాచి డ్రైవర్ అప్రమత్తమై లారీ పై ఉన్న హిటాచిని వెంటనే కిందకి దింపాడు. మంటలు లారీకి వ్యాపించి వెనకవైపు ఉన్న 11 టైర్లు కాలిపోయాయి. విషయాన్ని గమనించిన స్థానికులు ఉదయగిరి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. తెల్లరాయి వెలికి తీయించి హిటాచిని తిరిగి తీసుకెళ్లే క్రమంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం
నెల్లూరు జిల్లా బ్రహ్మేశ్వరం సమీపంలో హిటాచి యంత్రాన్ని తరలిస్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం సమీపంలో హిటాచి యంత్రాన్ని తరలిస్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న హిటాచి డ్రైవర్ అప్రమత్తమై లారీ పై ఉన్న హిటాచిని వెంటనే కిందకి దింపాడు. మంటలు లారీకి వ్యాపించి వెనకవైపు ఉన్న 11 టైర్లు కాలిపోయాయి. విషయాన్ని గమనించిన స్థానికులు ఉదయగిరి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. తెల్లరాయి వెలికి తీయించి హిటాచిని తిరిగి తీసుకెళ్లే క్రమంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:నెల్లూరులో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు